Rajanna Sircilla District : ఇనుపరాడ్‌తో దాడికి దిగిన దొంగను ధైర్య, సాహసాలతో ఎదుర్కున్న తెలంగాణ మహిళ

ముసుగుదొంగ ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇనుపరాడ్‌తో ఆమెపై దాడికి దిగాడు. ధైర్య సాహసాలతో అతనిని ఎదుర్కుని తన ప్రాణాలు కాపాడుకుంది ఆమె. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Rajanna Sircilla District

Rajanna Sircilla District :  దొంగను చూడగానే ముందు నోట మాట రాదు. వారి చేతుల్లో ఆయుధాలు ఉంటే ఇంక అంతే సంగతులు. కానీ ఓ మహిళ ఇనుపరాడ్‌తో దాడి చేసిన దొంగను ధైర్య సాహసాలతో ఎదుర్కున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. దొంగతో ధైర్యంగా పోరాడిన మహిళ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Sircilla Weavers: జాతీయ జెండాల తయారీలో బిజీగా సిరిసిల్ల నేతన్నలు.. జెండా పండుగతో భారీగా ఆర్డర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ మహిళ దొంగను హడలెత్తించింది. ఓ మహిళ తమ పెంపుడు కుక్క ఆపకుండా  అరుస్తుంటే అనుమానం వచ్చి బయటకు తొంగి చూసింది. అంతే ముసుగు వేసుకుని ఇనుపరాడ్‌తో ఓ దొంగ ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆ మహిళ ఏ మాత్రం భయపడకుండా అతని దాడి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. లోనికి చొరబడాలని అతను చేసిన ప్రయత్నాన్ని ఆమె విఫలం చేసింది. ఇరుగుపొరుగువారిని వినపడేలా గట్టిగా కేకలు వేసింది. దెబ్బకు దొంగ భయంతో పారిపోవడం మనకు వీడియోలో కనిపిస్తుంది. @jsuryareddy అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Sircilla: జనమంతా చూస్తుండగా రోడ్ రోలర్ తో తొక్కించి.. సిరిసిల్లా పోలీసుల వినూత్న ప్రయోగం!

ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 40 ఏళ్ల మహిళ ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటూ కిరాణా దుకాణం నడుపుతున్నట్లు తెలుస్తోంది. దొంగ ఆమె మెడలోని 7 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లినట్లు మహిళ కంప్లైంట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దుండగుడి ఆచూకీ కోసం సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.