Rape On Girl : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్‌

మరోవైపు ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఏ-2 సాదుద్దీన్‌ మాలిక్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లను రిమాండ్‌కు పంపారు. ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.

Remand

girl gang-rape case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు… మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. తప్పించుకున్న వారిలో ఓ మేజర్, మరో మైనర్ ఉన్నారు. బాలికపై అత్యాచారం చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అంది ఐదు రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఏ-2 సాదుద్దీన్‌ మాలిక్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లను రిమాండ్‌కు పంపారు. ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.

అటు.. గ్యాంగ్ రేప్ కేసులో ఎంతో కీలకంగా మారిన ఇన్నోవా కారు ఆచూకీని కూడా పోలీసులు కనుగొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించారు. క్లూస్ టీం నిపుణులతో.. కారులో ఉన్న ఆధారాలను సేకరించారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్‌మెంట్‌, మెడికల్ ఎగ్జామినేషన్‌ను పూర్తి చేసి.. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపారు పోలీసులు. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే ఇప్పుడు కీలకం కాబోతోంది. దానిని బట్టే.. అసలు దోషులు ఎవరన్నది తేలుతుంది.

Mahmood Ali: జూబ్లీహిల్స్‌ బాలిక అత్యాచారం కేసులో నిందితులు ఎవరైనా కఠిన చర్యలు : హోంమంత్రి మహమూద్‌ అలీ

ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగానే న్యాయస్థానం నిందితులకు శిక్షలు ఖరారు చేస్తుంది. ఇన్నోవా కారులోనే.. గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీసులు చెప్పారు. అదే నిజమైతే.. ఇప్పుడు క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో అసలు విషయం తేలిపోతుంది. కేసులో కీలకంగా మారిన ఇన్నోవా కారు.. గవర్నమెంట్‌ వెహికల్‌గా టెంపరరీ రిజిస్ట్రేషన్‌ జరిగిందని పోలీసులు గుర్తించారు.

నెంబర్ ప్లేట్ లేకుండానే ఆ కారు హైదరాబాద్‌లో తిరిగింది. వక్ఫ్‌ బోర్డు ఛైర్మనే.. ఆ కారు వాడుతున్నట్లు గుర్తించారు. ఆయన కుమారుడే ఇన్నోవాను తీసుకొచ్చాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.