TG Ration Distribution : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. 3 సార్లు బయోమెట్రిక్ తప్పనిసరి.. ఇవాల్టినుంచే స్టార్ట్

Telangana: తెలంగాణలోని రేషన్ (Ration Distribution)కార్డుదారుల కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.

Three month ration rice distribution to resume from august

  • 3 నెలల రేషన్
  • ఒకేసారి ఉచిత పంపిణీ
  • 15 వరకు గడువు

Telangana Ration Distribution: తెలంగాణలోని రేషన్ కార్డుదారుల కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల వల్ల నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ (Ration Distribution) బియ్యాన్ని ఈ నెలలోనే ఒకేసారి పంపిణీ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. నేటి నుంచే ప్రారంభమైన ఈ పంపిణీ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనుంది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక.. ధవళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్

లబ్ధిదారులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవడానికి తమ ప్రాంతంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈపాస్ (e-PoS) మిషన్‌లో వేలిముద్రలు వేసి సరుకులు పొందవచ్చు. అయితే మూడు నెలల కోటాను పొందేందుకు యంత్రంలో మూడుసార్లు బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంబీఎల్ (MLS) పాయింట్ల నుండి బియ్యం రవాణా శీఘ్రంగా జరుగుతోంది. చిన్న డిపోలకు ఒకేసారి, పెద్ద డిపోలకు రెండు విడతల్లో బియ్యం మూటలను అధికారులు చేరవేస్తున్నారు.

గతంలో వేసవి ఎండల తీవ్రతను తట్టుకోవడానికి ఏప్రిల్, మే, జూన్ నెలల సరుకులను కూడా ప్రభుత్వం ఇలాగే ఒకేసారి అందించడం గమనార్హం. కాకపోతే ఒకేసారి భారీగా నిల్వలు రావడంతో రేషన్ షాపులలో స్థలం సరిపోక డీలర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ పౌరసరఫరాల శాఖ పక్కా ప్రణాళికతో లబ్ధిదారులకు ఎలాంటి రేషన్ కొరత లేకుండా సరుకులను వేగంగా అందజేసేందుకు అన్ని చర్యలు పూర్తి చేసింది.