Narayanpet News: కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు మృతి

Narayanpet News

Narayanpet News: కరోనా మహమ్మారి ఓ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. కరోనాతో కొడుకు మృతి చెందాడని మరణవార్త విని.. తల్లి తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దామరగిద్ద మండలం మొగుల్ మడక గ్రామానికి చెందిన లింగం అనే వ్యక్తి కొద్దీ రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కొడుకు మరణవార్త విని తండ్రి భద్రయ్యస్వామి, తల్లి శశికళకు గుండెపోటు వచ్చింది.

దీంతో వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. ఒకే కుటుంబంలో గంటల వ్యవధిలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.