Telangana Rains (4)
Thunder Lightening Rains : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 8:30 ఆధారంగా వాతావరణ హెచ్చరికలు చేసింది. నైరుతి రుతుపవనాలు రాగల 2,3 రోజులలో ద్వీపకల్ప దక్షిణ భారతదేశంలోని మరి కొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య / పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని పేర్కొంది. రాగల మూడు రోజులకు వాతావరణ కేంద్రం పలు సూచనలు చేసింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
GVL Narasimha Rao : రాష్ట్రంలో ప్రమాదకర స్థితిలో శాంతిభద్రతలు : ఎంపీ జీవీఎల్
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.