Gift Your Scrap: ‘చెత్తను పారేయకండి.. అమ్మేయండిలా.. లేదా గిఫ్ట్‌ ఇవ్వండి’

స్క్రాప్ విరాళంగా ఇచ్చేవారు.. మనీ కావాలంటే తీసుకోవచ్చు లేదా Bhumi NGOకు విరాళం ఇచ్చేయొచ్చు. అటువంటి డబ్బు మొత్తాన్ని అర్హత కలిగిన విద్యార్థులకు స్కాలర్ షిప్ గా..

Gift Your Scrap: దీపావళి వచ్చేస్తుంది.. ఇంటిలో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి పండుగకు ఇల్లు శుభ్రం చేసుకుందామనుకుంటున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం. కానీ, ఒకటి గుర్తుపెట్టుకోండి. చెత్తను వృథాగా పారేసే బదులు గిఫ్ట్ గా ఇవ్వండి. Bhumi NGO మొదలుపెట్టిన కొత్త కాంపైన్ Gift Your Scrapతో మార్కెట్ లోకి వచ్చింది. దీని సహాయంతో పొడి చెత్తను స్క్రాప్ కలెక్టర్ కు అమ్మేసేయొచ్చు.

స్క్రాప్ విరాళంగా ఇచ్చేవారు.. మనీ కావాలంటే తీసుకోవచ్చు లేదా Bhumi NGOకు విరాళం ఇచ్చేయొచ్చు. అటువంటి డబ్బు మొత్తాన్ని అర్హత కలిగిన విద్యార్థులకు స్కాలర్ షిప్ గా ఇస్తామని భూమి ఎన్జీఓ వాలంటీర్ స్వప్న కే చెప్తున్నారు. తాము విరాళంగా ఇచ్చిన చెత్త ద్వారా వచ్చిన డబ్బును దేని గురించి వాడాలో ముందుగానే నిర్దేశించవచ్చు.

గతేడాది హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడే ఈ ఆలోచన వచ్చిందట. దీనినే మళ్లీ గిఫ్ట్ యువర్ స్క్రాప్ అనే కాంపైన్ కింద అమలు చేయాలని చూస్తున్నారు.

………………………………….. : తమన్నా వల్ల తడిసి మోపెడైందంట!

‘వరదల సమయంలో ఓ మహిళ పలు ఇళ్లలోని చెత్తను పోగి చేసి కొంత నిధులు సమీకరించి వరద బాధిత ఇళ్లకు చేరవేసింది. అలా ఈ ఐడియా పలు ఇతర అవసరాలను కూడా తీర్చింది. స్క్రాప్ తీసుకోవడం దానిని రీసైకిల్ చేయడం ద్వారా ఫండ్స్ వస్తాయని స్వప్న చెప్పారు. ScrapQ అనే కంపెనీ ఈ రీసైకిలింగ్ ప్రోసెస్ నిర్వహిస్తుంది.

ఇలా స్క్రాప్ విరాళంగా ఇచ్చే ముందు డోనార్స్ గూగుల్ ఫామ్ పూర్తి వివరాలతో నింపాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్లు, కార్టూన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటి వాటి బరువును కూడా అందులో నమోదు చేయాలి. దీనికి సంబంధించిన లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రెండింగ్ వార్తలు