TJS Chief Kodandaram: కేసీఆర్ తో కలసి మోదీ ప్లాన్.. బయటపెట్టిన కోదండరాం..

కుర్చీతోనే భూమిపై రాలిపడ్డా అనుకున్న కేసీఆర్ ను గుంజిపడేశాం. ఫామ్ హౌస్ లో కట్టి పడేశాం. కేసీఆర్ ఇక పైకి రాడు, బయటకి రాలేడు.

  • Updated on- May 12, 2026 / 07:05 PM IST

TJS Chief Kodandaram: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు టీజేఎస్ (తెలంగాణ జనసమితి) చీఫ్ కోదండరామ్. బీఆర్ఎస్, టీఆర్ఎస్ కుటుంబ పంచాయితీ మాత్రమే అని చెప్పారు. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ తెలంగాణకి ఏమైనా చెప్తారని ఆశించామని, కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు. మొన్న ఎన్నికల సమయంలోనే పొదుపు చేయాలని దేశ ప్రజలకు ఎందుకు చెప్పలేదని మోదీని ప్రశ్నించారాయన.

మేము ఏం చేయాలో చెబుతున్న మోదీ తానేం చేస్తారో చెప్పలేదని విమర్శించారు. మాకు అధికారం ఇస్తే నక్సలైట్లను చంపుతామని మోదీ అంటున్నారు.. చంపడం పరిష్కారం కాదు.. అని కోదండరామ్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఏకం కాదని నమ్మకం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

”ఉత్తిగానే సీబీఐ కేసులు పెడుతున్న చరిత్ర కనిపిస్తోంది. సీబీఐ విచారణ చేయమన్నా ఎందుకు చేయడం లేదు? కొన్ని నియోజకవర్గాలు ఎంచుకొని గట్టిగా పనిచేద్దాం. SIR తో తమకి నచ్చిన వాళ్ళ ఓట్లే ఉంచేలా కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ మనల్ని సమావేశాలు పెట్టుకొనివ్వలేదు. కేసీఆర్ మనకు పర్మిషన్లు ఇవ్వలేదు. కుర్చీతోనే భూమిపై రాలిపడ్డా అనుకున్న కేసీఆర్ ను గుంజిపడేశాం. ఫామ్ హౌస్ లో కట్టి పడేశాం. కేసీఆర్ ఇక పైకి రాడు, బయటకి రాలేడు. కేసీఆర్ ను పట్టుకొని పైకి వద్దామని మోదీ అనుకుంటున్నారు. మనం ఉన్నన్ని రోజులు మోదీ, కేసీఆర్ లను రానివ్వం.

మన కష్టానికి ఫలితం దక్కుతుంది. తెలంగాణ విషయంలో మనం మొదటి విజయం చూశాం. నిరంకుశ పాలకుడిని గద్దె దించి రెండవ విజయం చూశాం. మరిన్ని విజయాలను తప్పకుండా చూస్తాం” అని కోదండరామ్ అన్నారు.

Also Read: బెయిల్ ప్లీజ్.. హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్