Telangana Rains
Rains : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని వారు పేర్కోన్నారు.
జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, సంగారెడ్డి, పెద్దపల్లి, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. హైదరాబాద్‌లో శనివారం రాత్రి నుంచే చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆకాశం మొత్తం మేఘావృతమై ఉన్నది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Also Read : East Godavari: సెల్ఫీలు దిగుతూ గోదావరి నదిలో పడ్డ అక్కాచెల్లెళ్లు.. మృతి