Mahesh Kumar Goud: పార్టీలో విభేదాలు నిజమే.. పదవుల కోసం తీవ్ర పోటీ.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)స్పందించారు.
- V Santhosh Kumar
- Published on- August 29, 2026 / 09:20 PM IST
Tpcc chief mahesh kumar goud clarifies about internal conflicts
- కాంగ్రెస్ అంతర్గత విభేదాలపై స్పందన
- నేను ఎల్లప్పుడూ న్యూట్రల్ లీడర్
- రేవంత్‌తో గ్యాప్‌పై వ్యాఖ్యలు అబద్ధం
Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. పార్టీలోని విభేదాలు, బీసీ ప్రాతినిధ్యం, సమగ్ర కులగణన వంటి కీలక అంశాలపై ఆయన సమగ్రంగా చర్చించారు. కాంగ్రెస్ వంటి విస్తృత ప్రజాదరణ కలిగిన పార్టీలో పదవుల కోసం పోటీ, భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమైన ప్రక్రియ అని, ఇవన్నీ పార్టీ ప్రజాస్వామ్య వాతావరణంలోనే జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Ap PMAY Scheme: ఏపీ పేదలకు తీపి కబురు.. 4 లక్షల కొత్త ఇళ్లు మంజూరు.. వారంలోనే పట్టాల పంపిణీ!
గ్రూపు రాజకీయాలపై స్పష్టత:
పార్టీలో అంతర్గత విభేదాలు సహజమని మహేష్ కుమార్ గౌడ్ అంగీకరించినప్పటికీ, తాను ఏ గ్రూపుకూ కొమ్ముకాయనని స్పష్టం చేశారు. “కాంగ్రెస్ పెద్ద పార్టీ, ఆశావహులు మరియు అర్హత కలిగిన నాయకులు ఎక్కువగా ఉన్నప్పుడు పోటీ సహజం. కానీ నేను నిష్పాక్షికంగా పనిచేస్తాను” అని ఆయన వివరించారు. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీతో కలిసి గ్రూపు రాజకీయం చేస్తున్నానన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డితో సంబంధాలు:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తనకు మధ్య విభేదాలు లేదా గ్యాప్ ఉందంటూ వస్తున్న కథనాలను ఆయన పూర్తిగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ఇటువంటి అసత్య ప్రచారాలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. తామిద్దరం నిరంతరం సంప్రదింపులు జరుపుకుంటూ, పార్టీ, ప్రభుత్వ సమన్వయం కోసం కలసికట్టుగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అంతర్గత ప్రజాస్వామ్యంతో కాంగ్రెస్ మరింత బలంగా ముందుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.
