Huzurnagar : విగ్రహాలు పెట్టేదాక అన్నం ముట్టను..ఉత్తమ్ శపథం

విగ్రహాలను తొలగింపుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హూజుర్ నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు...

Huzurnagar

TPCC Ex President Uttam Kumar : టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం పూనారు. విగ్రహాలు పెట్టేదాక అన్నం ముట్టనని, నిరహార దీక్ష చేస్తానని ప్రకటించారు. విగ్రహాలను తొలగింపుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021, డిసెంబర్ 24వ తేదీ శుక్రవారం హూజుర్ నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. విగ్రహాలను పున:ప్రతిష్టించేంత వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకూర్చొన్నారు. ఉత్తమ్ ధర్నాకు దిగిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హుజూర్ నగర్ చౌరస్తాకు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read More : Marriage, Birth Loans : పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లోన్లు ఇస్తున్న బ్యాంకులు 

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ…హుజూర్ నగర్ లో అత్యంత చారిత్రాత్మకంగా ఉన్న ఇందిర చౌకు దగ్గర ఏ రాజకీయాలు లేకుండా 40 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ విగ్రహం ఉందన్నారు. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని బేస్ సిమెంట్ తో సహా…తీసేయడం చాలా దురదృష్టకరమన్నారు. అరెస్టు చేసి జైలుకు పంపుతామంటున్నారని..తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. అందరి సంగతి చూస్తాము.. ఎవరిని వదిలిపెట్టమన్నారు. చారిత్రాత్మకంగా ఉన్న ఇందిరమ్మ విగ్రహాన్ని పోలీసుల సహకారంతో కూల్చివేయడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Read More : Telangana Govt : ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌‌లపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు

కొంతమంది వ్యక్తులు చరిత్రను చెరిపి వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలు ఎందుకు కూల్చారో అధికారులు సమాధానం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రోడ్లు భవనాల శాఖ DE గులాబీ చొక్కా వేసుకొని ఎమ్మెల్యే ఆఫీస్ లో అటెండర్ ఉద్యోగం చేసుకుంటే బెటర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూల్చిన దగ్గరే ఇందిరా, వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టాలని.. నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఉత్తమ్ ప్రకటించారు.