Jakkidi Prabhakar Reddy : వాయిస్ రికార్డుల కలకలం.. జక్కిడి ప్రభాకర్ రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసులు..!
Jakkidi Prabhakar Reddy : జక్కిడి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వాయిస్ రికార్డులు కలకలం రేపడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
- Sreehari A
- Published on- July 14, 2026 / 09:25 PM IST
Jakkidi Prabhakar Reddy
- 3 రోజుల్లో వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ
- పార్టీ నేతలు, బీసీ కులాలపై వ్యాఖ్యలు..
- జక్కిడి ప్రభాకర్ రెడ్డికి కాంగ్రెస్ నోటీసులు
Jakkidi Prabhakar Reddy : కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేశారు.
జక్కిడి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వాయిస్ రికార్డులు వైరల్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఆ వాయిస్ రికార్డుల్లో పార్టీ నేతలతో పాటు కొన్ని బీసీ కులాలపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోందన్నారు.
Read Also : YS Jagan-Mudragada : ముద్రగడ మరణం తీరని లోటు.. పితృసమానుడిని కోల్పోయాం: వైఎస్ జగన్
ఈ క్రమంలోనే ఆయా ఆరోపణలపై జక్కిడి ప్రభాకర్ రెడ్డి తన వివరణను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.
తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరణను 3 రోజులలోగా లిఖితపూర్వకంగా అందజేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. ఆయన సమాధానం ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
