Hyderabad : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే..

Hyderabad : మెహదీపట్నం రైతుబజార్ వద్ద పాదచారుల సౌకర్యార్థం నిర్మిస్తున్న స్కైవాక్ పనులు, అదేవిధంగా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు పనులు జరుగుతున్న నేపథ్యంలో 24, 25 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Hyderabad

Hyderabad : హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్. మెహదీపట్నం, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ, రేపు (సోమవారం) ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ తెలిపారు.

Also Read : Petrol Price : వాహనదారులకు బిగ్‌షాక్.. మరోసారి ఇంధన ధరలు పెరుగుతాయా..? బీపీసీఎల్ కీలక ప్రకటన

మెహదీపట్నం రైతుబజార్ వద్ద పాదచారుల సౌకర్యార్థం నిర్మిస్తున్న స్కైవాక్ పనులు, అదేవిధంగా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ, రేపు సాయంత్రం 4గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నిర్మాణ పనులు జరిగే సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ఆయా రూట్లలో వాహనాలను దారిమళ్లించినట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయల్ తెలిపారు.

వాహనాల మళ్లింపు ఇలా..
♦ మాసబ్ ట్యాంక్, ఎస్.డి కంటి ఆస్పత్రి వైపు నుంచి రేతిబౌలి వైపు వెళ్లే వాహనాలను మెహదీపట్నం ప్రధాన రహదారిపై అనుమతించరు. ఈ వాహనాలు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 2, 3 (అజీజియా మసీదు) వద్ద ఎడమ వైపునకు తిరిగి, మెరాజ్ కేఫ్ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
♦ టోలిచౌకి, లంగర్‌హౌస్, అత్తాపూర్ ప్రాంతాల నుంచి మెహదీపట్నం మీదుగా మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే వాహనదారులు పిల్లర్ నంబర్ 23 వద్ద తప్పనిసరిగా యూ-టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాసబ్ ట్యాంక్‌కు చేరుకోవాలి.
♦ మాసబ్ ట్యాంక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా వెళ్లే వాహనాలను ఎస్.డి కంటి ఆస్పత్రి వద్ద ఉన్న లక్ష్మీనగర్ రాంప్ (పిల్లర్ నెంబర్ 77) వైపునకు మళ్లిస్తారు.
♦ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వైపు నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మెహదీపట్నం వైపు వచ్చే వాహనదారులు లక్ష్మీనగర్ రాంప్ వద్ద ఉన్న పిల్లర్ నంబర్ 88 వద్ద ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది.
♦ ప్రయాణ సమయంలో వాహనదారులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా లేదా రూట్లకు సంబంధించిన సందేహాలు ఉన్నా, తక్షణ సహాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక హెల్ప్‌లైన్ నంబర్‌ 9010203626లో సంప్రదించాలని జోయల్ డేవిస్ సూచించారు.