Petrol Price : వాహనదారులకు బిగ్‌షాక్.. మరోసారి ఇంధన ధరలు పెరుగుతాయా..? బీపీసీఎల్ కీలక ప్రకటన
Petrol Price :పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని (బీపీసీఎల్) డైరెక్టర్ హెచ్ఆర్ రాజ్ కుమార్ చెప్పారు ఈ క్రమంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఖాయమని అన్నారు.
Fuel Price Hike
- పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
- బీపీసీఎల్ డైరెక్టర్ కీలక ప్రకటన
- పరిస్థితులు ఇలాగే ఉంటే ఇంధన ధరలు భారీగా పెరిగే చాన్స్
Petrol Price : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావం భారతదేశంపైనా పడింది. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల భారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Also Read : Pakistan : పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ప్యాసింజర్ రైలులో ఘటన.. సైనికులతోసహా 24మంది దుర్మరణం
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గడిచిన పది రోజుల్లోనే మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచేశాయి. దీంతో మూడుసార్లు కలిపి లీటర్ పెట్రోల్ పై రూ.5 పెరుగుదల చోటు చేసుకుంది. అయితే, మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఖాయమని తెలుస్తోంది. ఇదే విషయంపై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) డైరెక్టర్ హెచ్ఆర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలుచేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీలకు మూడు మార్గాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటి ఇంధన ధరలు పెంచడం, రెండోది కంపెనీలు నష్టాలను భరించడం, మూడోది ప్రభుత్వం లోటు భర్తీ చేయడం అని వివరించారు.
ముడి చమురు ధరల్లో 20శాతం నుంచి 50శాతం వరకు పెరుగుదలను మొదట్లో తాత్కాలికంగానే భావించినప్పటికీ.. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని దుబే హెచ్చరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయని చెప్పుకొచ్చారు.
