Hyderabad Tragedy
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. 60 ఏళ్లకు పైబడిన ఓ వ్యక్తి ఆయన భార్య, కూతురు, అల్లుడు, రెండేళ్ల చిన్నారి ఇంట్లో విగతజీవులుగా కనపడ్డారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
మృతుల పేర్లను లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24), మరో చిన్నారి (2)గా పోలీసులు గుర్తించారు. వారంతా కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలి వాసులని వివరించారు.