TGSRTC Driver Dies: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం.. నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శంకర్ ను వరంగల్ MGM నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తుండగా కర్మాన్‌ఘాట్ దగ్గర కన్నుమూశాడు.

  • Updated on- April 23, 2026 / 11:11 PM IST

TGSRTC Driver Dies : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్ గౌడ్ చనిపోయారు. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శంకర్ ను వరంగల్ MGM నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తుండగా కర్మాన్‌ఘాట్ దగ్గర కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్‌బాగ్ DRDO అపోలో ఆస్పత్రిలో శంకర్ గౌడ్ మృతదేహం ఉంచారు.

వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె, కార్మికుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో డ్రైవర్ శంకర్‌ గౌడ్‌ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. తోటి సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి శంకర్ ను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ శంకర్ చనిపోయారు.