ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ

  • Publish Date - April 23, 2019 / 11:10 AM IST

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఈ త్రిసభ్య కమిటీ ఇంటర్మీడియట్ బోర్డుకు చేరుకుంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ సభ్యులు విచారించనున్నారు. బిట్స్ ఫిలానీ ప్రొ.వాసన్, ప్రొ.నిశాంత్, టీఎస్ టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు ఇంటర్ బోర్డులోకి వెళ్లారు. ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు, ఎగ్జామినేషన్ కంట్రోలర్ తో చర్చలు ప్రారంభించారు. ఫలితాల్లో అవకతవకలు, జాప్యంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే గ్లోబరీనా సంస్థ కార్యాయాలనికి వెళ్లి వివరాలు సేకరించారు.

ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదిక ఇస్తుంది. నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని తల్లిదండ్రులు, విద్యార్థులలో ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ హైకోర్టులో ఉండిపోయారు.