రెబల్స్‌ను సస్పెండ్ చేయనున్న TRS

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు తెరలేపింది. పార్టీ నుంచి రెబల్స్‌ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేర జిల్లాల సమన్వయకర్తలతో రిపోర్టులు తెప్పించుకుని నిర్ణయం తీసుకోనుంది టీఆర్ఎస్ అధిష్టానం. మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆసక్తి చూపడమే ఇందుకు కారణం.
కొద్దిమందికే సీట్లు దక్కడంతో మిగిలిన వారు అవకాశం కోల్పోయారు. వీరంతా స్వతంత్ర్యంగా పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. రెబల్స్ గా పోటీ చేసేందుకు బరిలోకి దిగుతుండటంతో మంగళవారం వరకూ బుజ్జగింపుల పర్వం నడిచింది. కొందరు తప్పుకున్నా.. ఇంకొన్ని చోట్ల నామినేషన్ ఉపసంహరించుకోని వారు పోటీ చేసేందుకు వెనక్కి తగ్గేట్లు కనిపించడం లేదు.
ఉమ్మడి మహబూబ్ నగర్ లో రెబల్స్ బెడద ఎక్కువ కనిపిస్తోంది టీఆర్ఎస్ పార్టీకి. వారంతా ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాల అభ్యర్థులు స్వతంత్ర్యంగా పోటీ చేసేలా చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేల ప్రోత్సహంతో స్థానికంగా మెజార్టీ ఉన్న అభ్యర్థులు స్వతంత్ర్యంగా పోటీ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.