TRS leader distributes liquor bottles: మద్యం బాటిళ్లు, కోళ్లను పంచిన టీఆర్ఎస్ నేత.. వీడియో వైరల్

 టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి వరంగల్ తూర్పు నియోజక వర్గంలో హమాలీలు, పేదలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంచిపెట్టారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఆ సంతోషంలో రాజనాల శ్రీహరి మమాలీలందరినీ లైనులో నిలబెట్టి వాటిని పంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సాామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

TRS leader distributes liquor bottles: టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి వరంగల్ తూర్పు నియోజక వర్గంలో హమాలీలు, పేదలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంచిపెట్టారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఆ సంతోషంలో రాజనాల శ్రీహరి  మమాలీలందరినీ లైనులో నిలబెట్టి మరీ వాటిని పంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సాామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

రాజనాల శ్రీహరి దాదాపు 200 కోళ్లు, 200 మద్యం బాటిళ్లను పంచినట్లు సమాచారం. కేసీఆర్ రేపు ప్రకటించబోయే జాతీయ పార్టీ గురించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దాని పేరు, జెండా, అజెండాపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నింటిపై రేపు కేసీఆర్ స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, కేటీఆర్ ను సీఎంను చేస్తారని ప్రచారం జరుగుతోంది.

కాగా, కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో మద్యం బాటిళ్లు, కోళ్లను పంచిపెట్టడంపై పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ… కేసీఆర్ ని ప్రధాన మంత్రిని చేయడానికి టీఆర్ఎస్ నేతలు మద్యం, కోళ్లను పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ఇది మీ ఐడియానేనా కేటీఆర్ గారూ?’’ అంటూ నిలదీశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు