BRS : టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మార్పు, బులెటిన్ విడుదల చేసిన రాజ్యసభ సచివాలయం
BRS : పలు మార్లు విజ్ఞప్తి తర్వాత చైర్మన్ ఆమోదంతో రాజ్యసభ సచివాలయం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.
- Naveen
- Published On : June 8, 2023 / 10:02 PM IST
BRS (Photo : Google)
BRS – Rajya Sabha : బీఆర్ఎస్ నేతల నిరీక్షణ ఫలించింది. రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. రాజ్యసభలో బీఆర్ఎస్ తరపున ఏడుగురు సభ్యులు ఉన్నట్లు బులిటెన్ లో తెలిపింది రాజ్యసభ సచివాలయం. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కేకే (కేశవరావు) ఉన్నట్లు పేర్కొంది.
బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత టీఆర్ఎస్ పేరు మార్చాలని రాజ్యసభ చైర్మన్ కి ఫ్లోర్ లీడర్ కేశవరావు పలు మార్లు విజ్ఞప్తి చేశారు. పలు మార్లు విజ్ఞప్తి తర్వాత చైర్మన్ ఆమోదంతో రాజ్యసభ సచివాలయం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. అలాగే, అన్ని పార్టీల సభ్యుల వివరాలతో పార్టీ వారీగా సంఖ్యను ప్రకటించింది రాజ్యసభ సచివాలయం.
