KTR : ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే మైగ్రేషన్.. ఇప్పుడు మహబూబ్ నగర్ అంటే ఇరిగేషన్ : మంత్రి కేటీఆర్

ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం.. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ రావటం వాస్తవం కాదా అని పేర్కొన్నారు. 30 శాతంగా ఉన్న ప్రసూతి... ఇప్పుడు 60 శాతం వచ్చిన మాట వాస్తవం కాదా అని అడిగారు.

KTR : ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే మైగ్రేషన్.. ఇప్పుడు మహబూబ్ నగర్ అంటే ఇరిగేషన్ : మంత్రి కేటీఆర్

KTR (1)

Mahabubnagar Irrigation : డబ్బులు చాలా మందికి ఉండవచ్చు కాని.. మంచి చేయాలనే ఆలోచన రావటం గొప్ప.. అలాంటిది మోహన్ రెడ్డి ఇక్కడ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరు లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమమైన విద్య అందించి, వారు పెద్ద వ్యవస్థల్లో సీట్లు సంపాదిస్తే తమకు ఎంతో ఆనందమని చెప్పారు.

మహబూబ్ నగర్ లో పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటిఐ కళాశాలలో సెయింట్ ఫౌండేషన్ మరియు శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ మరియు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

Minister KTR : కొత్తకోట, దేవరకద్రలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తాం : మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పరిశ్రమల కల్పనకు ఆ రోజుల్లో రెడ్ టేప్ ఉంటే.. నేడు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని తెలిపారు. ఇప్పుడు నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్ మీదేనని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు అందేలా ఉంటాయి.. స్కిల్ సంపాదించాలని సూచించారు.

నాడు పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన దుస్థితి వాస్తవం కాదా..? ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది.. మరి ఈ అంశాలను వేడుకలా చేసుకోవద్దా అని అన్నారు. ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే మైగ్రేషన్.. ఇప్పుడు మహబూబ్ నగర్ అంటే ఇరిగేషన్ అని అభిర్ణించారు. హైదరాబాద్ మారింది వాస్తవం కాదా? 24 గంటల కరెంటు ఉండటం వాస్తవం కాదా? అని అన్నారు.

Mallu Ravi : కేసీఆర్ సీఎంగా, కేటీఆర్ మంత్రిగా ఉన్నారంటే.. అది కాంగ్రెస్ పెట్టిన బిక్షే : మల్లు రవి

ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం.. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ రావటం వాస్తవం కాదా అని పేర్కొన్నారు. 30 శాతంగా ఉన్న ప్రసూతి… ఇప్పుడు 60 శాతం వచ్చిన మాట వాస్తవం కాదా అని అడిగారు. రియల్ ఎస్టేట్.. అప్పుడు ఎంత ఉండే.. ఇప్పుడు ఎకరా ఎంత ఉందో తెలియదా అని అన్నారు. ఇప్పుడు కేవలం స్కిల్ డెవలప్ మెంట్ పై దృష్టి సారించాలన్నారు.