Mallu Ravi : కేసీఆర్ సీఎంగా, కేటీఆర్ మంత్రిగా ఉన్నారంటే.. అది కాంగ్రెస్ పెట్టిన బిక్షే : మల్లు రవి

కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత 100 ఏళ్లకు కేటీఆర్ పుట్టాడని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు.

Mallu Ravi : కేసీఆర్ సీఎంగా, కేటీఆర్ మంత్రిగా ఉన్నారంటే.. అది కాంగ్రెస్ పెట్టిన బిక్షే : మల్లు రవి

Mallu Ravi

Mallu Ravi angry KTR : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారంతో రాజకీయ దుర్బుద్ధితో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, నాయకులపై కేటీఆర్ చేస్తున్న అసంబద్ధ మాటలు, అవాకులు చవాకులు ఆయన అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు సన్నాసులు, దద్దమ్మలు అంటూ కేటీఆర్ మాట్లాడడం ఆయన రాజకీయ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీది 140 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత 100 ఏళ్లకు కేటీఆర్ పుట్టాడని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే ఈ దేశం.. ఈ దేశ చరిత్ర అంటేనే కాంగ్రెస్ చరిత్ర అని అన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం తేవడం కోసం మందలాది మంది కాంగ్రెస్ నాయకులు అనేక రకాల త్యాగాలు చేశారని పేర్కొన్నారు.

Poonuri Gautham Reddy : హామీలు నెరవేర్చడంలో పేటెంట్ హక్కు కేవలం సీఎం జగన్ కే : పూనూరి గౌతమ్ రెడ్డి

భౌగోళికంగా ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ మంత్రిగా పదవులు అనుభవిస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్షనే అని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో మంత్రిగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం కేటీఆర్ రాజకీయ కుటిల నీతికి నిదర్శనమని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తప్పదని భావిస్తున్న కేటీఆర్ కాంగ్రెస్ పై విషం చిమ్ముతున్నాడని పేర్కొన్నారు. కేటీఆర్ ఎన్ని పిచ్చి ప్రేలాపణలు చేసినా.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.