Poonuri Gautham Reddy : హామీలు నెరవేర్చడంలో పేటెంట్ హక్కు కేవలం సీఎం జగన్ కే : పూనూరి గౌతమ్ రెడ్డి

ఆరు వేలపై చిలుకు ఉద్యోగాల భర్తీకి బుధవారం మంత్రివర్గంలో ఆమోదం చేశారని వెల్లడించారు. సచివాలయ వ్యవస్థతో నూతన అధ్యాయానికి జగన్ తెర లేపారని పేర్కొన్నారు.

Poonuri Gautham Reddy : హామీలు నెరవేర్చడంలో పేటెంట్ హక్కు కేవలం సీఎం జగన్ కే : పూనూరి గౌతమ్ రెడ్డి

Poonuri Gautham Reddy

CM Jagan promises : హామీలు నెరవేర్చడంలో పేటెంట్ హక్కు కేవలం సీఎం జగన్ కి మాత్రమే ఉందని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో కన్నా కార్మికులకు ఎక్కువ జీతాలు ఏపీ రాష్ట్రంలోనే ఇస్తున్నారని తెలిపారు. చేనేత కార్మికులు, ఆటో కార్మికులు, ఇలా అనేక రంగాల కార్మికులకు సీఎం చేయూత అందించారని పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంపై విజయవాడలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

AP – TS News : ఈ- ఆటోలను ప్రారంభించిన జగన్.. మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ న్యూస్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామన్న హామీని కూడా నెరవేర్చి ఇచ్చిన హామీలలో 99.5 శాతం అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.

ఆరు వేలపై చిలుకు ఉద్యోగాల భర్తీకి బుధవారం మంత్రివర్గంలో ఆమోదం చేశారని వెల్లడించారు. సచివాలయ వ్యవస్థతో నూతన అధ్యాయానికి జగన్ తెర లేపారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జగన్ ను పర్మినెంట్ సీఎంగా చేసేందుకు వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ కంకణం కట్టుకుందని చెప్పారు.