Minister KTR : కొత్తకోట, దేవరకద్రలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తాం : మంత్రి కేటీఆర్

కరెంట్, తాగునీరు, సాగునీరు ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

Minister KTR : కొత్తకోట, దేవరకద్రలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తాం : మంత్రి కేటీఆర్

KTR

Mahabubnagar : తెలంగాణ ఏర్పడ్డనాడు దేవరకద్రలో 40 వేల ఎకరాలు సాగు అయ్యేదని మంత్రి కేటీఆర్ అన్నారు. చెక్ డ్యామ్ లతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. దేవరకద్రలో అద్భుతమైన చెక్ డ్యామ్ ల నిర్మాణం జరిగిందన్నారు. 2023లో 98 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. కరివేన పూర్తి అయితే లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండలం వేముల గ్రామంలో రూ.500 కోట్లతో ఎస్ జీడి ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Mallu Ravi : కేసీఆర్ సీఎంగా, కేటీఆర్ మంత్రిగా ఉన్నారంటే.. అది కాంగ్రెస్ పెట్టిన బిక్షే : మల్లు రవి

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కొత్తకోట, దేవరకద్రలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తామని పేర్కొన్నారు. కరెంట్, తాగునీరు, సాగునీరు ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. లైఫ్ సైన్స్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు.

అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీళ్లు, కరెంటు ఇవ్వలేదని.. మళ్ళీ ఏం మొహం పెట్టుకుని జనాలను ఓటు వేయమని అడుగుతున్నారని ప్రశ్నించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేస్తున్నారని కొనియాడారు. కేటీఆర్ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.