Bhatti Vikramarka: వారి ముత్తాతలు వచ్చినా అడ్డుకోలేరు.. మరో 5 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం.. ఆ తర్వాత..

ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

Bhatti Vikramarka: వారి ముత్తాతలు వచ్చినా అడ్డుకోలేరు.. మరో 5 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం.. ఆ తర్వాత..

Bhatti Vikramarka

Bhatti Vikramarka – Congress: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ (Telangana) లో మరో 5 నెలల్లో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ వారి తాత, ముత్తాతలు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకునే సత్తా, దమ్ము, ధైర్యం లేదని చెప్పారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం డిండి వద్ద నక్కలగండి ప్రాజెక్టును భట్టి విక్రమార్క పరిశీలించారు.

అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల వారోత్సవాలు చేసే అర్హత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. కొత్తగా రాష్ట్రంలో ఒక్క చిన్న చెరువు అయినా తవ్వారా అని నిలదీశారు.

“కృష్ణా, గోదావరిపై పెద్ద ఆనకట్టలు ఏమైనా కట్టారా? పెండింగులో ఉన్న సాగునీటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా? ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా వారోత్సవాలు చేస్తారు?” అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

Hyderabad : బాబోయ్.. పోలీసుల ఫేస్‌బుక్ పేజీలో అశ్లీల చిత్రాలు.. హైదరాబాద్‌లో కలకలం, అసలేం జరిగిందంటే