Donald Trump: తెలంగాణ గవర్నమెంట్ కు ట్రంప్ థాంక్స్.. కారణం ఇదే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Donald Trump thanked the Telangana government

  • తెలంగాణకు ట్రంప్ ధన్యవాదాలు.
  • హైదరాబాద్‌లో ట్రంప్ అవెన్యూ.
  • భారత్ అమెరికా సంబంధాల గౌరవార్థం.

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఓ కీలకమైన రోడ్డుకు తన పేరు పెట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ అరుదైన గౌరవం పొందిన తొలి యూఎస్ ప్రెసిడెంట్ తానేనని పేర్కొంటూ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ లో ట్రంప్ స్పందించారు.

Sri Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్‌లో బిగ్ ట్విస్ట్.. సిఐ మిత్రుడు సురేష్ అరెస్ట్.. శవాన్ని మాయం చేసేందుకు భారీ స్కెచ్

నగరంలోని యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న రోడ్డుకు తెలంగాణ ప్రభుత్వం ‘డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అవెన్యూ’ గా నామకరణం చేసింది. జూన్ 23న జరిగిన ఈ రోడ్డు ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, యూఎస్ రాయబారి సెర్జియో గొర్ పాల్గొనగా, ఆ ఫొటోను ట్రంప్ షేర్ చేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు ఉన్న ప్రాంతంలోనే ఈ రోడ్డు ఉండటం విశేషం. భారత్-యూఎస్ సంబంధాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

హైదరాబాద్‌లో త్వరలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌కు ముందే ఈ నామకరణం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థల పేర్లను కూడా ప్రధాన రహదారులకు పెట్టే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.