TS 10th Results 2026 : నేడే పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇక్కడ చెక్ చేసుకోండి..

BSE TS 10th Results 2026 : తెలంగాణలో టెన్త్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2గంటలకు ఫలితాలను విడుుదల చేయనున్నారు.

Ts 10th Results 2026 Telangana Government To Release Ssc Results Today

  • నేడు తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • ఫలితాలకోసం డైరెక్ట్ లింక్ ఇక్కడ చెక్ చేసుకోండి

TS 10th Results 2026 : తెలంగాణలో టెన్త్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2గంటలకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌లు ఫలితాలను విడుదల చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా మార్కుల ఇవ్వనున్నారు.

Also Read :  మా ఓటమికి వాళ్లే కారణం.. మేము ఆ ఒక్క పనిచేసుంటే గెలిచేవాళ్లం.. శ్రేయాస్ అయ్యర్

ఫలితాలను results.bsetelangana.org, results.bse.telangana.gov.inతోపాటు https://10tv.in/లోనూ చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు తెలుసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కాక.. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు 80969 58096 నంబర్‌‌కి వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేసి, ‘SSC రిజల్ట్స్’ అని టైప్ చేసి, ఆ తర్వాత హాల్‌టికెట్ నంబర్ ఇస్తే ఫలితాల వివరాలు వస్తాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయ్యాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. 10 వేల మందికి పైగా సప్లీమెంటరీ విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇవాళ మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్నారు.