Inter Second Year Results To Be Released By Next Week
TS Inter Second Year Results : వచ్చేవారంలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. జులై 1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభమవుతాయని సబిత వెల్లడించారు.
బుధవారం సబిత మాట్లాడుతూ.. ఫీజుల విషయంలో గతంలో ఇచ్చిన జీవో 46ను అమలు చేస్తామని తెలిపారు. ఫీజుల అంశంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఫీజుల తగ్గింపుపై ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో చర్చిస్తామని తెలిపారు.
ఈ నెల 25 నుంచి టీచర్లు స్కూళ్లకు రావాలని మంత్రి సబిత ఆదేశించారు. ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎస్‌ను కోరామని సబిత చెప్పారు. మరోసారి మంత్రులతో సమావేశం ఉంటుందని అన్నారు.