KTR Letter : సింగరేణి కోల్ మైన్ కాదు,గోల్డ్ మైన్..దాని జోలికొస్తే ఢిల్లీకి తెలంగాణ సెగ తప్పదు: కేటీఆర్ వార్నింగ్

సింగరేణి కోల్ మైన్ కాదు..గోల్డ్ మైన్..దాని జోలికొస్తే ఢిల్లీకి తెలంగాణ సెగ తప్పదు అని కేంద్రానికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

Ktr Letter To Union Govt

KTR Letter to Union Govt : మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ లెటర్ రాశారు. సింగరేణి అంటే తెలంగాణకు ఓ అక్షయపాత్రలాంటిది. అటువంటి సింగరేణి బొగ్గు గనుల జోలికి వస్తే ఊరుకునేది లేదని మంత్రి కేటీఆర్ కేంద్ర గనుల శాఖా మంత్రికి ఘాటు లేఖ రాశారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలం ఆపాలని లేదంటే సింగరేణి కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుంది అంటూ లేఖలో ఘాటుగా పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలోని సింగరేణిలో నాలుగు బొగ్గు గనుల వేలం ఆపాలన్నారు‌. ఈ గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Also read : Women IPL: పూర్తి తరహాలో మహిళా ఐపీఎల్ – బీసీసీఐ సెక్రటరీ

ఈ సందర్భంగా కేటీఆర్ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. సింగరేణి నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారం అని అన్నారు. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతీస్తుందని థమ్కీ ఇచ్చారు. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందని వార్నింగ్‌ ఇచ్చారు.

TS M inister KTR letter to Mines union Minister prahalad joshi over singareni mines blocks action

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్ల కాలంలో సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసిందని సింగరేణిని అభివృద్ధిలో నడిపించే ఎన్నో చర్యలు తీసుకున్నామని అద్భుత ఫలితాలు సాధిస్తోందని అటువంటి సింగరేణిపై కేంద్రం కన్ను పడిందని అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా సింగరేణిపై ఆధిపత్యం చెలాయిద్దామనుకుంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. బీజేపీ కుట్రలను తిప్పికొడతామని అన్నారు మంత్రి కేటీఆర్‌.

Also read : AP movie tickets Controversy : ఏపీలో ఎన్నో సమస్యలున్నా ప్రభుత్వం సినిమా టిక్కెట్లమీదే ఫోకస్ చేస్తోంది : కనకమేడల

సింగరేణిని బలహీనపరిచాలనే ఉద్ధేశ్యంతోనే కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బ్లాకులు వేరే సంస్థలకు కేటాయించడం ద్వారా నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుటిల ప్రయత్నాల్లో కేంద్రంముందని విమర్శలు చేశారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదు.. యువతకు ఉపాధి కల్పించే గోల్డ్ మైన్ అన్నారు. తెలంగాణ వచ్చాక 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామమని మంత్రికేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సింగరేణిని ప్రైవేటకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరకవని.. గనులు మూతపడిన కొద్దీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారన్నారు కేటీఆర్‌. కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటాలుండవని తెలిపారు. కేంద్రం చేసే కుట్రలను తిప్పి కొట్టి సింగరేణిని కాపాడుకుంటామని..కార్మికులకు అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.