Dr. BR Ambedkar Telangana Secretariat : తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈమేరకు కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరును ఖరారు చేస్తూ గురువారం(సెప్టెంబర్ 15,2022) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Dr. BR Ambedkar Telangana Secretariat : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈమేరకు కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరును ఖరారు చేస్తూ గురువారం(సెప్టెంబర్ 15,2022) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఇదిలావుంటే కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌.. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.  తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు భారత సామాజిక దార్శనికుడు మహా మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు.

Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు.. ప్రభుత్వ నిర్ణయం

ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమని తెలిపారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. అంబేద్కర్ దార్శనికతతోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. ఈ నిర్ణయం దేశానికి ఆదర్శమన్నారు.

ఢిల్లీలో నూతనంగా నిర్మాణమవుతున్న పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. ఇదే విషయమై త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ కూడా రాస్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు