TSPSC Paper Leak
TSPSC – Paper leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission) పేపర్ లీకేజ్ కేసులో అధికారులు ఇప్పటివరకు 90 మందికి పైగా అరెస్టు చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న వారందరూ దాని నుంచి తప్పించుకోవడానికి ముప్పుతిప్పలు పడుతున్నారు.
ఈ కేసులో దొరకుండా ఉండేందుకు ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన భార్యాభర్తలు సిమ్ కార్డులు మార్చి, పుణ్యక్షేత్రాలకు వెళ్లివచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయినప్పటికీ ఈ కేసులో తప్పించుకోలేమని భావించిన ఆ భార్యాభర్తలు సిట్ ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో మొత్తం 15 మంది కేసు నుంచి తప్పించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు.
టీఎస్పీఎస్సీ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అందగానే రెండో ఛార్జిషీట్ దాఖలు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సూత్రధారులుగా ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని అధికారులు గుర్తించారు. పాస్ వర్డులు, పేపర్ లీకేజీలు ఎలా జరిగాయన్న విషయాలపై అధికారులు పూర్తి వివరాలు రాబట్టారు.
Maharashtra : భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న పోలీసు అధికారి