TSPSC Jobs Notification 2026 : TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల.. 24 పోస్టులు.. లక్షకుపైగా జీతం.. అర్హతలు ఇవే..
TSPSC Notification 2026 : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టీజీపీఎస్సీ నుంచి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది.
- Harish Thanniru
- Updated on- June 6, 2026 / 12:31 PM IST
Tspsc Jobs Recruitment Notification 2026 Released
- నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్
- 24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
- మల్టీజోన్ –1లో 10, మల్టీజోన్ –2లో 14 పోస్టులు
TSPSC Notification 2026: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పలు శాఖల్లో 290 పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగు రోజుల వ్యవధిలోనే తాజాగా.. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) & గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read – Lingamaneni Ramesh : జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు
మొత్తం 24 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 12 నుంచి ప్రారంభం కానుంది. జులై 19 సాయంత్రం 5గంటల వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో ధరఖాస్తు చేసుకోవడానికి టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ పోస్టులకోసం దరఖాస్తు చేసుకొనేవారి అభ్యర్థుల వయస్సు జులై 1, 2026 నాటికి కనీసం 18ఏళ్లు నిండి ఉండాలని, గరిష్ఠంగా 44ఏళ్లు లోపు ఉండాలని సూచించింది. డిగ్రీ లేదా పీజీలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎంపిక విధానం రాత పరీక్ష సీబీఆర్టీ/ఓఎంఆర్ పద్దతిలో ఉంటుందని తెలిపింది. జూలై 19వ తేదీన పరీక్ష ఉంటుందని, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని టీజీపీఎస్సీ పేర్కొంది.
మొత్తం 24 పోస్టులను మల్టీ జోన్ల వారీగా విభజించారు. మల్టీజోన్ -1 పరిధిలో 10 పోస్టులు, మల్టీజోన్ -2 పరిధిలో 14పోస్టులు ఉన్నాయి. వీటిలో 22 పోస్టులు లోకల్ కు కేటాయించగా.. రెండు పోస్టులు అన్ రిజర్వుడ్ కింద చూపించారు. అయితే, మల్టీజోన్-1లో ఓపెన్ కేటగిరిలో మూడు, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ1, బీసీ 2, ఎస్సీ1లో ఒకటీ, ఎస్సీ 2 కేటగిరీలో ఒకటీ ఖాళీలున్నాయి. మల్టీజోన్ 2లో ఓపెన్ కేటగిరీలో ఆరు, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీ బీ, బీసీ సీలో ఒక్కొక్కటీ చొప్పున ఖాళీలున్నాయి. ఎస్సీ1, 2 కేటగిరీల్లో ఒక్కోటి, ఎస్టీలో ఒకటి చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 1000, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు తమ వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాలను అప్‌డేట్ చేసుకుని అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
విద్యాశాఖలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశమని, పూర్తి అర్హతలు, సిలబస్, ఫీజు వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం www.websitenew.tgpsc.gov.in ను సందర్శించాలని టీజీపీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి ప్రతి నెల వేతనం రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు ఉంటుందని టీజీపీఎస్సీ పేర్కొంది.
