TSRTC Bumper Offer : సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులు రాను పోను ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
- bheemraj
- Published On : December 27, 2022 / 12:42 PM IST
tsrtc
TSRTC Bumper Offer : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులు రాను పోను ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. డిలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31వరకు రాయితీ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. వారి కోసం 4,233 స్పెషల్ బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. వీటిలో 585 బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
మొత్తం 4,233 బస్సులకు గానూ అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరంకు 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్ధం అడ్వాన్స్ డ్ టికెట్ బుకింగ్ ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ వరకు అందుబాటులో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.
