TSRTC : హైదరాబాద్ సిటీ బస్సుల్లో డే పాస్ ధరలు పెంపు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైన మరుసటి రోజే

గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పుడు 100 రూపాయలు అయింది. 80, 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.

-TSRTC-  Day Pass Price : హైదరాబాద్ నగర ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) షాక్ ఇచ్చింది.  ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన మరుసటి రోజే హైదరాబాద్ సిటీ బస్సుల్లో డే పాస్ ధరలు పెంచింది. నగరంలోని సిటీ బస్సుల్లో డే పాస్ ధరలు పెంచుతూ ఈ మేరకు టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సిటీ బస్సుల్లో (Hyderabad City Bus) డే పాస్ ధరలు పెరిగాయి. 100 రూపాయలున్న డే పాస్ ను 120 కు పెంచింది. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే ధరల పెంపు మొదలైంది.

గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పుడు 100 రూపాయలు అయింది. 80, 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే, 120 రూపాయలు డే పాస్ సమయంలో రోజుకీ 25 వేలు మాత్రమే అమ్మకం జరుగుతోంది. కానీ, 80 రూపాయల డే పాస్ సమయంలో రోజుకీ 40 వేల వరకు అమ్మకం జరిగేది. పెరిగిన టికెట్ ధరలతో మళ్లీ బాదుడు మొదలైందని ప్రయాణికులు అంటున్నారు.

TSRTC: 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఎండీ సజ్జనార్ హర్షం

మరోవైపు టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెడతామని చెప్పారు. విధి విధానాలను నిర్ణయించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

దీంతో టీఎస్ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. 43 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రకటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు