×
Ad

Sankranti TSRTC Buses : సంక్రాంతికి అదనంగా మరో 4,233 బస్సులు… సాధారణ ఛార్జీలే వసూలు

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని మరో 4,233 అదనపు బస్సులను నడపనుంది. ఈ మేరకు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ పేర్కొన్నారు.

  • Published On : January 8, 2023 / 01:20 PM IST

RTC BUS

Sankranti TSRTC Buses : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని మరో 4,233 అదనపు బస్సులను నడపనుంది. ఈ మేరకు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ పేర్కొన్నారు. ఎంజీబీఎస్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ రాష్ట్రంతోపాలు అంతర్రాష్ట్ర బస్సుల్లో అదనపు చార్జీలకు మినహాయింపు ఇచ్చారు. సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు అదనపు బస్సులను నడపడానికి ప్రత్యేక ప్రాణాళికలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంక్రాంతికి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మహాత్మ గాంధీ బస్ స్టేషన్ లో తొలిసారి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిన వెంటనే పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. ఏ ఏ పాయింట్లలో రద్దీ ఉంది వంటి వివరాలను తెలుసుకునేందుకు ప్రయాణికులు 9959224911 నెంబర్ లో సంప్రదించి సమాచారాన్ని తెలుసుకోవచ్చని అధికారులు చెప్పారు.

TSRTC Bumper Offer : సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

అంతేకాకుండా కాలనీలోని 20 మంది కన్నా ఎక్కువగా ప్రయాణికులు ఉంటే స్థానిక డిపో మేనేజర్ కు
సమాచారం అందిస్తే వారి వద్దకే బస్సును పంపిస్తామని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో ప్రయాణికులు టికెట్ బుక్ చేసువడానికి www.tsrtconline.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఒకేసారి అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీ పొందవచ్చని అధికారులు వెల్లడించారు.