L Ramana : రేపు టీఆర్ఎస్ లోకి ఎల్ రమణ

టీటీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎల్. రమణ సోమవారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు.

L Ramana

L Ramana : టీటీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎల్. రమణ సోమవారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు. ఈ నెల 16 న కేసీఆర్ సమక్షంలో ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరుతారు.

ఇక సోమవారం అధికారికంగా టీఆర్ఎస్ లో చేరనున్నారు. మూడు రోజుల క్రితం ఆయన ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. గంటకు పైగా సీఎం కేసీఆర్, రమణ చర్చించుకున్నారు. రమణ రాజకీయ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే రెండు మూడు నెలల్లో తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడనుంది.

ఇందులో ఒకటి ఎల్. రమణకు ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్లుగా సమాచారం. సీఎం కేసీఆర్ హామీతో ఆయన టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రమణకు ప్రాథమిక సభ్యత్వం అందిస్తారు. 16న తెలంగాణ భవన్ లో తన అనుచరులు అభిమానులతోపాటు పలువురు టీటీడీపీ నేతలతో కలిసి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.