×
Ad

Road Accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బైకును ఢీకొన్న కారు, ఇద్దరు మృతి

గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులు మహేశ్వరం మండలం మంకల్ పారిశ్రామిక వాడలోని శ్రీనాథ్ రోటో ప్యాక్లో పని చేస్తున్నట్లు తెలిసింది.

  • Published On : August 21, 2023 / 11:38 AM IST

road accident (15)

Rangareddy Road Accident : రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మహేశ్వరం మండలం తుక్కుగూడ – శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తుక్కుగూడ వైపు నుండి హైదరాబాద్ వైపు ఓ కారు వెళ్తోంది.

వేగంగా వచ్చిన కారు బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న ముగ్గురిలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు.

Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మృతి

గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులు మహేశ్వరం మండలం మంకల్ పారిశ్రామిక వాడలోని శ్రీనాథ్ రోటో ప్యాక్లో పని చేస్తున్నట్లు తెలిసింది.