Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు
తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
- Naveen
- Updated on- May 15, 2026 / 09:33 PM IST
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్ కు తరలించారు. గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాకర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శకుంతల హార్ట్ కు స్టంట్ వేసి అత్యవసర చికిత్స అందిస్తున్నారు మెడికవర్ వైద్యులు. విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read: బండి భగీరథ్ కేసుపై అనసూయ షాకింగ్ పోస్ట్.. వైరల్ అవడం కోసమే చేస్తావా.. నెటిజన్స్ ఫైర్
