Muthireddy Yadagiri Reddy : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదు

ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేశారని తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు.

Muthireddy Yadagiri Reddy

Muthireddy Yadagiri Reddy : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదు అయింది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి తన తండ్రిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేశారని తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు.

తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు మేరకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంబంధించి గతంలో కొన్ని కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఇప్పడు ఫోర్జరీ సంతకానికి సంబంధించి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై స్వయంగా ఆయన కూతురే ఫిర్యాదు చేశారు.

Muthireddy Yadagiri Reddy : ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాక్ ఇచ్చిన కూతురు

ఆమె ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై 406, 420, 463, 464, 468, 471, R/w34ipc 156(3)crpc సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఇదివరకే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. చెరువు భూమిని ఆయన కబ్జా చేశారంటూ గతంలో ఆరోపణులు వచ్చాయి. ఇప్పుడు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదుతో మరోసారి భూ వివాదం తెరపైకి వచ్చింది.