ప్రాణం తీసిన మూత్రం.. బస్సు ఆపేలోగా డోర్ నుంచి దూకి ప్రయాణికుడు మృతి
- Naveen
- Published On : February 11, 2021 / 06:14 PM IST
urine kills man in vikarabad: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మూత్రం.. ఓ ప్రయాణికుడి ప్రాణం తీసింది. బస్సు ఆపేవరకు ఆగలేకపోయిన ప్రయాణికుడు, కదిలే బస్సులోంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాములు (50) తాపీ మేస్త్రి. బుధవారం(ఫిబ్రవరి 10,2021) సాయంత్రం ముంబై వెళ్లడానికి రావల్‌పల్లి గ్రామం దగ్గర బస్సు ఎక్కాడు. భార్య అతడిని బస్సు ఎక్కించి వెళ్లిపోయింది. బస్సు రావల్‌పల్లి గ్రామం దాటి అరకిలోమీటరు వెళ్లగానే.. రాములుకి మూత్రం అర్జంట్ అయ్యింది. మూత్రం వస్తోంది.. బస్సు ఆపాలని డ్రైవర్‌ను అడిగాడు. రోడ్డు పక్కన ఆపుతానని డ్రైవర్ చెప్పాడు.
కాగా, అంతలోనే తెరచి ఉన్న తలుపు నుంచి రాములు కిందికి దూకాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడు స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు షాక్ కి గురయ్యారు. కళ్ల ముందే జరిగిన ఘోరాన్ని చూసి తట్టుకోలేకపోయారు. అయ్యో పాపం, ఎంత ఘోరం జరిగిపోయింది అని కంటతడి పెట్టారు.
