victim Lakshmi
Lakshmi: నగ్న వీడియోలు, డ్రగ్స్ పార్టీలతో మస్తాన్ సాయి కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్టు చేసిన పోలీసులు జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. అయితే, బిగ్ బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ భాషాపైనా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శేఖర్ బాషాపై కేసు నమోదు చేశారు. మరోవైపు లేడీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ కూడా నార్సింగ్ పోలీసులకు శేఖర్ బాషాపై ఫిర్యాదు చేశారు. తాజాగా లక్ష్మీ అనే ఓ మహిళ శేఖర్ బాషా, ఎస్పీ శ్రీనివాస్ నన్ను వేదిస్తున్నారని వాపోయింది. 10టీవీతో ఆమె మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించింది.
Also Read: Shekhar Basha: శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ..
తిరుపతి రెడ్ స్యాండిల్ యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ తనను మోసం చేశాడని బాధితురాలు లక్ష్మీ వాపోయింది. గతంలో ఓ అబ్బాయి పై ఫిర్యాదు చేయడానికి వెళితే ఎస్పీ శ్రీనివాస్ నన్ను ట్రాప్ చేశాడు.. నన్ను మానసికంగా వేధించాడు. నాపై లైంగిక దాడి చేశాడని ఆమె పేర్కొంది. నన్ను, నా ఫ్యామిలీని అంతం చేస్తానని ఎస్పీ శ్రీనివాస్ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బిగ్ బాస్ ఫ్రేమ్ శేఖర్ బాషా నాకు ఓ ఈవెంట్ లో పరిచయం అయ్యాడు. ఎస్పీపై పెట్టిన కేసులో నీకు సహాయం చేస్తానని నమ్మించి నన్ను శేఖర్ బాషా కూడా వేధింపులకు గురి చేస్తున్నాడు. శేఖర్ బాషా, ఎస్పీ శ్రీనివాస్ ఇద్దరు చేతులు కలిపి నన్ను హింసిస్తున్నారు అని బాధితురాలు లక్ష్మీ పేర్కొంది.
శేఖర్ బాషా వలన గతంలో ఓ అమ్మాయి చనిపోయింది. ఎస్పీతో ఉన్న కొన్ని ప్రయివేట్ వీడియోలతో యూట్యూబ్ చానల్స్ లో పెట్టి వేధిస్తున్నాడు. ఎస్పీ శ్రీనివాస్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఆయన్ను సస్పెండ్ చేయాలి. శ్రీనివాస్ భార్యకు ఈ విషయం మొత్తం చెప్పినా కూడా ఆమె కూడా భర్తకు సపోర్ట్ చేస్తుందని బాధితురాలు లక్ష్మీ పేర్కొంది. నాకు న్యాయం కావాలని బాధితులు డిమాండ్ చేసింది.