Priyanka Gandhi : రైతు ఇంటికి వెళ్లిన ప్రియాంక గాంధీ.. ఆప్యాయంగా పలకరించడంతో సంబరపడిపోయిన కుటుంబం

తెలంగాణలో ప్రచారంలో ఉన్న ప్రియాంక గాంధీ ఈరోజు ఓ రైతు ఇంటికి వెళ్లారు. ఆమె రాకతో ఆ కుటుంబం సంబరపడిపోయింది. ప్రియాంక కూడా వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Priyanka Gandhi

Priyanka Gandhi : సాధారణంగా పొలిటీషియన్స్ సామాన్యులతో మమేకమయ్యే సమయం ఎన్నికల సందర్భంలోనే జరుగుతుంది. తాజాగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ సామాన్యురాలిగా మారిపోయారు. ఓ రైతు కుటుంబం ఇంట్లోకి వెళ్లి ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Priyanka Gandhi Dance : ఎన్నికల ప్రచార రథంపై ప్రియాంక గాంధీ డ్యాన్స్‌ .. ఉత్సాహంతో ఊగిపోయిన కార్యకర్తలు

ప్రియాంక తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. హుస్నాబాద్‌లో సభ ముగించుకుని కిషన్‌నగర్ వైపు వెళ్తుండగా జరిగిన ఓ సంఘటన వైరల్ అవుతోంది. ప్రియాంక వెళ్తున్న కాన్వాయ్‌ను ఆపమంటూ రమాదేవి అనే మహిళ చేతులు ఊపింది. వెంటనే కాన్వాయ్ దిగిన  ప్రియాంక ఆ మహిళతో పాటు ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఉండటంతో ప్రియాంక స్వామిని దర్శించుకుని ఆ మహిళతో పాటు సెల్ఫీ దిగారు.

ప్రియాంక రమాదేవిని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుని ముద్దు ఇచ్చారు. తను అప్పట్లో ఇందిరమ్మను కలవాలని అనుకున్నా కానీ ఆమె మనవరాలిని కలవడం సంతోషంగా ఉందని రమాదేవి అంటుంటే.. ప్రియాంక ఆమెతో ఎంతో ఆప్యాయంగా ‘నాతో స్నేహం చేస్తావా? నీ నంబర్ షేర్ చేయి’ అని అడిగారు. కళ్లు మూసుకుని ఓటు వేయవద్దని.. ఆలోచించి ఓటు వేయమని రమాదేవికి ప్రియాంక సూచించారు. తెలుగులో ‘జాగ్రత్తగా నిలబడు’ అంటూ ఆమెను మరోసారి ఆప్యాయంగా కౌగిలించుకుని అక్కడి నుంచి కదిలారు. ఈ అందమైన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

Priyanka Gandhi: ఉద్యోగం కావాలంటే కేసీఆర్‌ను ఓడించాలి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్

మరోవైపు సభల్లో ప్రియాంక గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి గడువు తేదీ దగ్గర పడిందని, యువత, మహిళలు, రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని. .నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్ధానంలో ఉందని ప్రియాంక విమర్శించారు.