×
Ad

Vijayashanthi : కమలం పార్టీలో కలకలం.. నాకా అలవాటు లేదంటూ సొంత పార్టీ నేతలపైనే విజయశాంతి సీరియస్

కొంతమంది సొంత పార్టీ నేతలు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. Vijayashanthi

  • Published On : September 21, 2023 / 07:32 PM IST

VIJAYASHANTHI On Fire

Vijayashanthi – BJP : తెలంగాణ బీజేపీలో నాయకుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. బండి సంజయ్ (Bandi Sanjay) ని తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించనప్పటి నుంచి ఈ విభేదాలు మరింత పెరిగాయి. నాయకులు వర్గాలుగా విడిపోయారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి.

తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి సొంత పార్టీ నేతలపైనే బరస్ట్ అయ్యారు. బీజేపీకి తాను దూరం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విజయశాంతి నిప్పులు చెరిగారు. ఆ ప్రచారాన్ని ఆమె ఖండించారు. చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదన్నారు విజయశాంతి.

Also Read: షర్మిలకు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి చెక్..! కారణం అదేనా? షర్మిల ఏం చేయనున్నారు?

పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16న ముఖ్య సమావేశంలో తాను స్పష్టంగా తెలియచేశాను అన్నారు. లీకేజీల పేరుతో ఆ విషయాలను బహిర్గతం చేయడానికి తాను వ్యతిరేకం అన్నారామె. కొంతమంది సొంత పార్టీ నేతలు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. బీజేపీకి రాములమ్మ దూరం అంటూ తనపై సోషల్ మీడియాలో చేయిస్తున్న ప్రచారాన్ని ఖండించారు విజయశాంతి.