Vijayashanti
Bharat Ratna: కేంద్ర ప్రభుత్వం పలువురు ప్రముఖులకు దేశంలోనే అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించింది. వీరిలో తెలుగుజాతి గౌరవ ప్రతీక, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారత రత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. పీవీకి భారతరత్న పురస్కారం దక్కినవేళ కాంగ్రెస్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని విజయశాంతి పేర్కొన్నారు.
Also Read : Bharat Ratna 2024 : 61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజానికి ‘భారతరత్న’
విజయశాంతి ట్వీట్ ప్రకారం.. భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు. కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక పీవీ నరసింహా రావును వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ కు కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈరోజున నిండుగా, మెండుగా కనబడుతోందని విజయశాంతి అన్నారు.
Also Read : Bharat Ratna : ఈ ఏడాది ఎంత మందికి భారతరత్న ఇచ్చారో తెలుసా?
ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తారనికూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం అని విజయశాంతి పేర్కొన్నారు.
భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని… pic.twitter.com/Q95K2oFOSC
— VIJAYASHANTHI (@vijayashanthi_m) February 9, 2024