×
Ad

Vijayashanthi : కాళేశ్వరం మీకు కాటేశ్వరం అవుతుంది : CM కేసీఆర్‌పై విజయశాంతి మాటల తూటాలు

కాంగ్రెస్ నేత విజయశాంతి బీఆర్ఎస్ ప్రభుత్వం..సీఎం కేసీఆర్ పై సంచలన విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీకు కాటేశ్వరం అవుతుందని..బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాటికి పంపే ఈశ్వరం అవుతుందన్నారు.

  • Published On : November 22, 2023 / 04:48 PM IST

Vijayashanthi Sensational Comments on KCR

Vijayashanthi Sensational Comments on KCR : అలంపూర్ లో కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో పాల్గొన్న విజయశాంతి బీఆర్ఎస్ ప్రభుత్వం..సీఎం కేసీఆర్ పై విమర్శల దాడితో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు రూపాయలు దోచేశారు అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం మేటిగడ్డ కూలిపోవటానికి సిద్ధంగా ఉందని..అదే కాళేశ్వరం మీకు కాటేశ్వరం అవుతుందని..బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాటికి పంపే ఈశ్వరం అవుతుందన్నారు.

ప్రజలంతా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని మీ అమూల్యమైన ఓట్లు వేసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. మీ ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ గెలుపు ఖాయం అని బీఆర్ఎస్ గద్దె దిగటం ఖాయమని తేలిపోయిందన్నారు. ఈ పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివద్ధి జరగలేదు సరికదా.. ప్రజలమీద దండయాత్ర జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలమీద దండయాత్ర చేసిన కేసీఆర్ ను గద్దెదింపేందుకు అందరు కలిసి కట్టుగా ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించాలని రాములమ్మ పిలుపునిచ్చారు.

Also Read : భూకబ్జాదారు రేవంత్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు : సీఎం కేసీఆర్

ఎస్సీ, ఎస్టీలపై దండయాత్ర చేసి..భూముల్ని లాక్కున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు. ప్రాజెక్టుల పేరుతో భూముల్ని లాక్కుని నిర్వాశితుల బతుకులు ఆగం చేసిన ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు. ధరిణి పోర్టల్ పేరుతో కొన్ని వేల ఎకరాల మోసాలు జరిగాయన్నారు. గ్రనేట్ తవ్వకాలు,ఇసుక తవ్వకాలు దోపిడీలకు అంతేలేదన్నారు. ఇలా చెప్పుకుంటుపోతే ఒకటికాదు రెండు కాదు ఎన్నో దోపిడీలు చేశారు అంటూ మండిపడ్డారు. గ్రేనేట్ తవ్వకాల పేరుతో పెద్ద పెద్ద కొండల్ని కూడా నేలమట్టం చేసిపారేశారని విమర్శించారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది..మరి బీఆర్ఎస్ ప్రజలకు ఏం గ్యారంటీ ఇచ్చింది..? అని ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు, బినామీలు ఇలా అందరు కలిసి ప్రజల్ని దోచుకుంటున్నారంటు దుయ్యబట్టారు.అటువంటివారికి బుద్ధి చెప్పేలా కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించాలని రాములమ్మ పిలుపునిచ్చారు.