CM KCR : భూకబ్జాదారు రేవంత్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు : సీఎం కేసీఆర్

రేవంత్ భూకబ్జాలు చేస్తాడని.. అటువంటి వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నాడని కానీ రేవంత్ సీఎం కాలేడు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసేస్తారని చెప్పారని..ధరణిని తీసివేసి ‘భూమాత’ అని పేరు పెడతారట..అది భూమాతనా..? భూ మేతనా..? అంటూ ప్రశ్నించారు.

CM KCR : భూకబ్జాదారు రేవంత్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు : సీఎం కేసీఆర్

CM KCR In Kodangal Public Meeting

CM KCR In Kodangal Public Meeting : కొడంగల్ బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరటానికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి డబ్బుల మూటలు ఇచ్చి అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి జైల్లో చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదని మండిపడ్డారు. రేవంత్ భూకబ్జాలు చేస్తాడని.. అటువంటి వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నాడని కానీ రేవంత్ సీఎం కాలేడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసేస్తారని చెప్పారు.. ధరణిని తీసివేసి ‘భూమాత’ అని పేరు పెడతారట.. అది భూమాతనా..? భూ మేతనా..? అంటూ ఎద్దేవా చేస్తూ ప్రశ్నించారు.

కాంగ్రెస్ లో 15 మంది సీఎం అభ్యర్థులున్నారని.. సీఎం అవుతానని రేవంత్ రెడ్డి కలలు కంటున్నాడని కానీ అయ్యేది లేదీ పెట్టేది లేదు వీళ్లు రాష్ట్రానికి చేసేది ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని, అటువంటి కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు. గెలిచేది లేకపోయినా.. కాంగ్రెస్ లో నేను సీఎం అంటే కాదు నేనే సీఎం అంటూ కొట్లాడుకుంటున్నారు అంటూ సెటైర్లు వేశారు.

రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి తెలవదని అందుకే మూడు గంటలు చాలు అంటున్నాడని.. అటువంటి వ్యక్తిని గెలిపిస్తే మీరు మరోసారి మోసపోతారన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ఆలోంచి వినియోగించుకోవాలన్నారు. ధరణిని తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుంది? బీమా ఎలా వస్తుంది? కాబట్టి ఆలోచించాలన్నారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ అని, అటువంటి కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కొడంగల్ లో పనిచేసే బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కావాలా.. ఫాల్త్ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి కావాలా..? ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఎవరుంటే కొండగల్ గౌరవం పెరుగుతుందో తేల్చుకోవాలన్నారు.

Also Read: 50 ఏళ్ల కాంగ్రెస్, పదేళ్ల BRS పాలన గమనించి ఓటు వేయండి : సీఎం కేసీఆర్