CM KCR : 50 ఏళ్ల కాంగ్రెస్, పదేళ్ల BRS పాలన గమనించి ఓటు వేయండి : సీఎం కేసీఆర్

ప్రజల సహాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అని అన్నారు సీఎం కేసీఆర్. 10 ఏళ్ల మా పాలనలో రాష్ట్రం ఎలా ఉందో మీ కళ్లముందే కనిపిస్తోందని ఆ అభివద్ధిని చూసే ఓటు వేయాలని కోరారు.

CM KCR : 50 ఏళ్ల కాంగ్రెస్, పదేళ్ల BRS పాలన గమనించి ఓటు వేయండి : సీఎం కేసీఆర్

CM KCR

CM KCR In BAS meeting in Tandoor : తాండూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అని అన్నారు. 10 ఏళ్ల మా పాలనలో రాష్ట్రం ఎలా ఉందో మీ కళ్లముందే కనిపిస్తోందని ఆ అభివద్ధిని చూసే ఓటు వేయాలని కోరారు. 15 ఏళ్లు పోరాటం చేసిన తెలంగాణను సాధించుకున్నామని..అటువంటి పోరాటాల తెలంగాణలో మరింత అభివద్ధి జరగాలంటే మరోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఓటు మన తలరాతను మారుస్తుందనే విషయాన్ని ప్రతీ ఓటరు గుర్తుంచుకోవాలని ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

కాంగ్రెస్‌ హయాంలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. 50ఏళ్ల కాంగ్రెస్‌.. పదేళ్ల BRS పాలనను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. అటువంటి పార్టీని మరోసారి గెలిపించాలని కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను మరింత అభివద్ధి చేసుకోవాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఎన్నో పార్టీలు ఎన్నో చెబుతాయి.. అరచేతిలో వైకుంఠం చూపిస్తాయి. కానీ ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు సూచించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. హ్యాట్రిక్ విజయం సాధించాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపిస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రైతుబంధు రూ.16 వేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Also Read: పార్టీల మ్యానిఫెస్టోల్లో వాగ్దానాలు పుష్కలం.. రాష్ట్ర ఖజానాలో నిధులు అంతంతమాత్రం