Delhi Liquor Scam : కవిత కేసులో జరగబోయేది ఇదే..! సీబీఐ విచారణపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నందున ప్రశ్నించాలంటే కచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి.

VV Lakshmi Narayana On Kavitha Case

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీన్ లోకి సీబీఐ వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. వచ్చే వారం కవితను తీహార్ జైల్లో ప్రశ్నించబోతున్నారు సీబీఐ అధికారులు. జైల్లోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది.

కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇవ్వడంతో.. ఈ కేసులో నెక్ట్స్ ఏం జరగబోతోంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. కవిత విచారణకు సీబీఐకి కోర్టు అనుమతి ఇవ్వడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

కవిత విచారణకు సీబీఐకి అనుమతిపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన..
”ఈడీ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న కవితను తీహార్ జైల్లో ప్రశ్నించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ అధికారులు కవితకు సమాచారం ఇచ్చి తీహార్ జైలుకి వెళ్లి ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నందున ప్రశ్నించాలంటే కచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఒక మహిళను విచారించే సమయంలో ఒక మహిళా అధికారులు ఉంటారు. వారే ప్రశ్నిస్తారు. ఇది సర్వ సాధారణం. వారి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా లేడీ కానిస్టేబుల్ లేదా ఉమెన్ ఆఫీసర్ సమక్షంలో విచారిస్తారు.

లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంటి? అనేది సీబీఐ పరిశీలిస్తోంది. 100 కోట్ల స్కామ్ పై ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కర్పషన్ యాక్ట్ కింద ఆధారాలు లభిస్తే ఛార్జ్ సీటు వేసే అవకాశం ఉంది. ఒకవేళ కవితకు బెయిల్ వస్తే విచారించేందుకు అవకాశం ఉండకపోవచ్చని, అందుకే జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సమయంలోనే కవితను ప్రశ్నించేందుకు సీబీఐ కోర్టు అనుమతి తీసుకుంది అనుకోవచ్చు. విచారణలో సేకరించిన సాక్ష్యాలు కోర్టులో నిలవాలి. ఆరోపణలు కోర్టులో ప్రూవ్ అవుతాయా? లేదా? అన్నదాని మీద కేసు ఆధారపడి ఉంది”.

Also Read : ఏపీలోని 5 విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతాం: కాంగ్రెస్