Konda Surekha: ఆడవాళ్ళతో కొట్టిస్తా.. నోరు అదుపులో పెట్టుకోండి.. వరంగల్‌లో కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తనపై లేదా పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను లక్ష్యంగా చేసుకుని కొండా సురేఖ (Konda Surekha)ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

Warangal congress mla konda surekha warns party leaders over internal rifts

Konda Surekha: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. స్థానికంగా కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను తీవ్రంగా పరిగణించిన ఆమె, పార్టీ నాయకులంతా విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు పార్టీ హితం కోరి ఐకమత్యంగా ముందుకు సాగాలని, లేనిపక్షంలో అనవసర విమర్శలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు క్షేత్రస్థాయిలో ఏమీ చేయలేక కేవలం గాల్లో కత్తులు తిప్పుతున్నారని ఆరోపిస్తూ, తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై కఠినంగా ఉంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

Supreme Court On UPI: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కేంద్రం, ఆర్‌బీఐకి నోటీసులు!

నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు – ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక:

తనపై లేదా పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసే కొంతమంది నేతలను లక్ష్యంగా చేసుకుని కొండా సురేఖ (Konda Surekha)ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో మహిళ నలుగురితో సమానంగా పోరాడగలదని, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు మహిళా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా కొండా సురేఖ స్పష్టం చేశారు.