Weather Updates: తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలు ఇవే..

Rain in telangana

తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపింది.

Also Read: యుద్ధంతో పసిడి ధరలకు రెక్కలు.. ఇంతలోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో ఆ జోరుకు కళ్లెం.. ఇప్పుడు బంగారం కొనొచ్చా?

వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలు ఇవే..
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జోగులాంబ

ఆయా జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. కాగా, ఇవాళ కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.