Aadi Srinivas: నీకు చిప్పకూడు తినే టైమ్ దగ్గర పడింది- కేటీఆర్ పై ఆది శ్రీనివాస్ ఫైర్

మీరు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు అడ్డగోలుగా ప్రవర్తించావు, దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నావు అని వ్యాఖ్యానించారు.

  • Updated on- February 24, 2026 / 08:00 PM IST

Aadi Srinivas Representative Image (Image Credit To Original Source)

  • రేవంత్ రెడ్డిని జైలుకి పంపి వికృతంగా ప్రవర్తించారు
  • పదేళ్ల పాలనలో అనేక అక్రమ కేసులు పెట్టారు
  • మీరు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారా?

Aadi Srinivas: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ కు చిప్పకూడు తినే టైమ్ దగ్గర పడిందన్నారు. కటకటాలు లెక్క పెట్టే సమయం వచ్చిందన్నారు. నీ పాపాలన్నీ తవ్వుతున్నారని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతోమందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. చిన్న డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డిని జైలుకి పంపి వికృతంగా ప్రవర్తించింది మీరే అని మండిపడ్డారు ఆది శ్రీనివాస్.

బాల్క సుమన్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్ పై బాల్క సుమన్ దాడి చేయడం అందరూ చూశారని అన్నారు. మంత్రుల మీద దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని కేటీఆర్ ను నిలదీశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మీరు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు అడ్డగోలుగా ప్రవర్తించావు, దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నావు అని సీరియస్ అయ్యారు. ప్రజలు ఎన్నిసార్లు ఛీత్కరించినా మీకు సిగ్గు రావడం లేదని ధ్వజమెత్తారు.

Also Read: ఎంతకు తెగించార్రా.. హైదరాబాద్‌లో కల్తీ టీ పొడి తయారీ ముఠా అరెస్ట్.. చాయ్ లవర్స్ బీకేర్ ఫుల్